క్రికెట్ కాదు చదువు ముఖ్యం| Kapil Dev responds to Shoaib Akhtar’s proposal for India vs Pakistan series

క్రికెట్ కాదు చదువు ముఖ్యం| Kapil Dev responds to Shoaib Akhtar’s proposal
for 
                                                    India vs Pakistan series

కరోనా
వైరసపై పోరుకు నిధుల సమీకరణ కోసం భారత్-పాకిస్థాన్
క్రికెట్
జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు.
కానీ
, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా
తోసిపుచ్చాడు. ఆ ప్రతిపాదనను కపిల్ తిరస్కరించాడని  పాకిస్థాన్‌కు చెందిన మరో మాజీ క్రికెటర్ షాహిద్
అఫ్రిది తప్పుపట్టాడు. అయితే
, అఫ్రిది విమర్శలకు కపిల్
తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చాడు.
మీరు భావోద్వేగంలో ఉంటే
భారత్-పాక్ మ్యాచ్లు ఆడాలంటారు. కానీ
, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ
రెండు జట్లు తలపడడం ముఖ్యం కాదు.

 మీకు డబ్బులు కావాలంటే సరిహద్దుల్లో కవ్వింపు
చర్యలను తక్షణం ఆపేయండి. వాటిపై పెట్టే ఖర్చును ఆస్పత్రులు
, పాఠశాలల
నిర్మాణాలకు వెచ్చించవచ్చు. లాక్ డౌన్ కారణంగా పిల్లలు పాఠశాలలు
, కళాశాలలకు
వెళ్లలేక పోవడం ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల లాక్ డౌన్ పూర్తయ్యాక తొలుత వాటిని
తెరవాలి. ఆ తర్వాతే క్రికెట్ గురించి ఆలోచిద్దాం

అని కపిల్ అన్నాడు.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *