ఈ పుచ్చకాయకు గింజలుండవ్|Seedless watermelon| Watermelon without seeds


పుచ్చకాయకు గింజలుండవ్
|Seedless
watermelon| Watermelon without seeds

 వేసవి తాపం
తీరాలంటే పుచ్చకాయను మించిన పండు మరొకటి లేదు. రుచికి రుచి.. పోషకాలు కూడా మెండుగా
ఉన్న పుచ్చకాయలో ఎవరికైనా నచ్చని ఒకే ఒక్క విషయం గింజలు. ఎంతో ఇష్టంగా తింటుంటే
… పంటికింద రాయిలా గింజలు అడ్డుపడుతుం టాయి. మరి ఈ గింజలే లేని పుచ్చ కాయ ఉంటే
ఎంతో బాగుంటుందని మీకెప్పుడైనా అనిపించిందా
? అయితే మీ కోరిక తీరాలంటే మీరు
కేరళ వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కేరళ మార్కెట్లో గింజలు లేని పుచ్చకాయలు
దొరుకుతున్నాయి. కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ.. పిరావామ్లోని ఐదున్నర ఎకరాల్లో ఈ
కాయలను పండించింది.

ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ పుచ్చకాయలకు భలే డిమాండ్
ఉందట. ఇంకెల్ అనే సంస్థ వీటిని పండిస్తోంది. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను
ఉపయోగించి పుచ్చకాయలను పండించామని ఆ సంస్థ ఎండీ టి. బాలకృష్ణన్ తెలిపారు.
 


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *