బార్లీతో ప్రయోజనాలు| Benefits of Barley | Most Impressive Health Benefits of Barley

బార్లీతో
ప్రయోజనాలు
| Benefits of Barley | Most Impressive Health                                 Benefits of Barley





ఎంతో
ఆరోగ్యస్పృహ ఉన్నవారు మినహా బార్లీని ఆహారంగా తీసుకునేవారు. మన సమాజంలో కొద్దిగా
తక్కువే. అయితే బార్లీ గింజల్లోని పోషకాలు ఎంతో ఆరోగ్యకరం కాబట్టి వీటిని హెల్త్
ట్రెండ్స్ లో విరివిగా వాడుతుంటారు. అంతేకాదు… ఆరోగ్యకరం అంటూ ఉత్పత్తి చేసే
బ్రిడ్లూ
, బిస్కెట్లలోనూ దీన్ని వాడుతుంటారు.

 బార్లీతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని
మాత్రమే బార్లీలో పోటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది రక్తపోటును అదుపులో
ఉంచుతుంది. బార్లీలో పీచు పదార్థాలు కూడా ఎక్కువ. అందువల్ల అది జీర్ణాశయపు
ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. బార్లీలోని పీచుపదార్థాల వల్ల అవి రక్తంలో
చక్కెరను అతి మెల్లగా విడుదలయ్యేలా చేస్తాయి. దాంతో చక్కెర అదుపునకు బాగా
తోడ్పడతాయి. ఈ కారణం వల్లనే అవి డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడంతో పాటు
, డయాబెటిస్
లేనివారిలో నివారణకు తోడ్పడతాయి.

ఈ గింజలు కొలస్త్రాల్ నూ  బాగా అదుపు చేస్తాయి. రక్తపోటుతో పాటు కొలస్త్రాల్
ను  అదుపు చేసే గుణం ఉండటం వల్ల ఇవి  అనేక  రకాల గుండె జబ్బులనూ
, గుండెపోటును నివారిస్తాయి. బార్లి లోని విటమిన్-ఎ  కారణంగా ఇవి కంటి చూపును దీర్ఘకాలం పాటు పదిలంగా
కాపాడతాయి. వీటిల్లో ఐరన్ కూడా ఎక్కువే. అందువల్ల రక్తహీనతను నివారిస్తాయి. బార్లీలో
ఉండే క్యాల్షియం
, ఫాస్పరస్  ఎముకలను మరింత శక్తిమంతం చేస్తాయి. ఇందులోని
మెగ్నీషియమ్
, జింక్ వంటి ఖనిజాలు చర్మానికీ, వెంట్రుకలకూ మెరుపునిస్తాయి.

బార్లి
లోని విటమిన్ బి కాంప్లెక్స్ తో పాటు విటమిన్ సి లు
 మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా
అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి.

SUMMARY

ధాన్యం
బార్లీలో విటమిన్లు
, ఖనిజాలు మరియు ఇతర ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలు ఉన్నాయి. 


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *