గుండెను పటిష్టం చేసే సైక్ల్లింగ్ | health benefits of cycling 15 minutes a day|

 

health benefits of cycling 15 minutes a day

సైకిల్
తొక్కడమనేది గుండెకు, రక్తనాళాలకు మేలు కలిగించే వ్యాయామ ప్రక్రియ. అలాగే స్థూలకాయులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వ్యాయామాన్ని చేయాలనుకుంటే ముందుగా ప్రారంభించాల్సిన ప్రక్రియ సైకి లింగ్.

 

మనిషిలోని
నిస్సత్తువను, మందకొడితనాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని కలిగించడంలో కూడా సైకిలింగ్ ఎంతో ఉపయోగ పడుతుంది. సైకిలింగ్ను ఒక వ్యాయామ ప్రక్రియగా చేయదలచుకున్నప్పుడు రద్దీగా ఉండే రహదారులను ఎన్నుకో కూడదు. వీలైనంత వరకూ ఖాళీగా ఉండే పార్కులు, మైదానాలు మొదలైన వాటిని ఎంచుకుని అక్కడ సైకిలింగ్ చేయాలి.

Cycling benefits for health

సుమారు
రెండు దశాబ్దాల క్రితం వరకూ రంగు, ఎత్తు వంటి ప్రమాణాలతోనే సైకిళ్లు తయారు చేసేవారు. తరువాత ఆరోగ్య రక్షణకు ఒక వ్యాయామ ప్రక్రియగా సైకి లింగ్ రూపొందిన తరువాత ఆయా పరిస్థి తులకు, ప్రదేశాలకు అనుగుణమైన సైకిళ్లు అందుబాటు లోకి వచ్చాయి. పర్వత ప్రాంతాలకు అనుకూలమైన మౌంటెనీ రింగ్ సైకిళ్లు, పట్టణ ప్రాంతాలకు అనుకూలమైన రకాలు, రేసులకు అనువుగా ఉండే సన్నని టైర్ల రేసింగ్ సైకిళ్లు ? ఇలా అనేక రకాలు అందుబాటులోకి వచ్చాయి.

 

వీటిలో
ట్రెక్కింగ్ లేదా హైబ్రిడ్ సైకిళ్లు చక్కని సదు పాయంతో సైకిలింగ్ చేసే వారికీ  అనుకులంగా  ఉంటాయి.
 సైకిలింగ్
చేసే వారు గాలి, ఎండ, వేడి,
మంచు వంటి వాతావరణ పరిస్థితుల నుంచి శరీరానికి రక్షణ కల్పించే దుస్తులు ధరించాలి. పాదాలకు అతుక్కుని దృఢంగా ఉండే బూట్లను ఎంపిక చేసుకుని సైకిలింగ్ చేయాలి. రోడ్లపై ఉండే దుమ్ము ధూళి, సూర్యరశ్మిలోని అల్టా వయొలెట్ కిరణాలు బారినుంచి కళ్లకు
రక్షణ కల్పించే కంటి అద్దాలు ధరించడం మొదలైనవి సైకిలింగ్ సమయంలోఎంతో
ఉపయోగకరంగా ఉంటాయి.

Top 5 Benefits of cycling


సైకిలింగ్
ద్వారా సత్ఫలితాలు పొందాలంటే సైకిల్ తొక్కే పద్దతి ప్రధానం. పెడల్ను గుండ్రంగా తొక్కడం, పాదాలను సరైన పద్దతిలో పెడల్పై ఆనించడం వంటి నియమాలు తప్పని సరిగా ఆచరించాలి. సైకిల్ ఫ్రేమ్కు సమాంతరంగా కాళ్ల కదలికతో సైకిల్ను తొక్కుతూ ఉండాలి

ఒకపాదంతో పెడల్ను కిందకు తొక్కుతూ, మరొక పాదంతో రెండవ పెడల్ను పైకి తీసుకురావాలి. దీని వలన కీళ్లపై అధిక భారం పడకుండా చూడవచ్చు. పెడల్ను సగం వరకూ ముందుకు తొక్కి మళ్లీ వెనుకకు తీసుకు రావడం మంచి పద్దతి కాదు. పెడల్ను పూర్తిగా గుండ్రంగా తొక్కాలి. దీని వలన కాళ్లలోని కీళ్లు, మోకాళ్లు, మణికట్టు ఒకేసారి
వ్యాయామ ప్రక్రియలో పాల్పంచుకుని సత్ఫలితాలనిస్తాయి.

Cycling is best for heart health

సైకిల్
సీటు సైకిల్ను తొక్కుతున్న వ్యక్తి ఎత్తుకు అనుగుణంగా ఉండాలి. మోకాలు కొంచెం వంగి ఉండే విధంగా సైకిల్ తొక్కాలి. కాలు నిటారుగా వచ్చినప్పుడు పాదం పెడల్ కంటే కిందికి వంగి ఉండాలి. అంటే ముందు భాగాన ఉండే పెడల్ ఆక్సిల్కు మోకాలు నిటారుగా ఉన్నప్పుడు సీటుపై కూర్చునే పద్ధతి సరైనదని చెప్పవచ్చు. సీటుపై కూర్చునే క్రమంలో ఎదురు గాలిని నిరోధించ గలిగే ఎయిరో డైనమిక్స్ పద్దతిలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. అయితే భుజాలు, వెన్నుపూస, చేతి మణికట్టు కు సమస్యలు ఉత్పన్నం కావని నిర్ధారించుకున్న తరు వాతే అలా కూర్చోవాలి.

 

సైకిలింగ్
వ్యాయామం ప్రారంభ దశలో వారానికి రెండుసార్లు 15 నుంచి 20 నిముషాలు చేయాలి.తరువాత అన్ని రోజుల్లో చేస్తూ, సమ యాన్ని పెంచుతూ రావాలి. గుండె కొట్టుకునే స్థాయి పరిమితిని మించకుండా సైకి లింగ్ చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *